ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్హాలులో పంచాయతీరాజ్ శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ తదితర ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. మొదలుకాని భవన నిర్మానాల పనులు 15 రోజుల్లో పునాది స్థాయికి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమష్టిగా పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.