బాక్సర్ నిఖత్ జరీన్ మరోమారు మనదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తాజాగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పంచ్ విసిరింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్ ఇవాళ జరిగిన ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన కార్లీ మెక్ నాల్ పై విజయం సాధించింది. ఈ బౌట్ లో జడ్జిలు 5-0తో నిఖత్ కే ఓటేశారు. ఇదిలావుంటే నిఖత్ సాధించిన స్వర్ణంతో భారత్ కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 48 పతకాలు ఉన్నాయి.