మధ్యప్రదేశ్లో శనివారం పిడుగుపాటుకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని విదిష, సత్నా, గుణ జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. విదిశా జిల్లాలో వర్షంలో తడవకూడదనే ఉద్దేశంతో నలుగురు చెట్టు కింద తల దాచుకున్నారు. చెట్టుపై పిడుగు పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.మిగిలిన వారు కూడా పిడుగు పడి వివిధ చోట్ల చెట్ల కింద మృతి చెందారు.