అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనిపై చైనా గుర్రుగా ఉంది. తైవాన్ తమ భూభాగంలోనిదేనని వాదిస్తోంది. తైవాన్ గగనతలంలో చైనా ఫైటర్ జెట్లు నేటికీ యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. తైవాన్ తీరంలోనే చైనా యుద్ధనౌకలు మోహరించాయి. తైవాన్ కూడా తమ భూభాగం కోసం అవసరమైతే యుద్ధం చేస్తామని చెబుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.