శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 1,23,942 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా.. మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,46,593 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.4385 టీఎంసీలకు చేరుకుంది.