ఓ వృద్ధుడిని కుటుంబసభ్యులే కొట్టి చంపేసిన దారుణ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కోరాపూట్ జిల్లాలోని ఒక గిరిజన ప్రాంతానికి చెందిన కుర్షా మనైకా అనే వృద్ధుడికి, అతడి కొడుకు, సోదరుడికి మధ్య గొడవ తలెత్తింది. దీంతో కోపం తెచ్చుకున్న కుర్షా కొడుకు, కోడలు, తమ్ముడు కలిసి అతడిని స్తంభానికి కట్టేసి, విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన కుర్షా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.