దాల్చిన చెక్కతో మొటిమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి మొటిమలతో పాటు మచ్చలను పోగొడతాయి. దాల్చిన చెక్క పొడికి కొద్దిగా రోజ్‌వాటర్, కొన్ని నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ పేస్ట్ ను మొటిమలు, మచ్చలున్న చోట రాయాలి. అలానే పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.