బిహార్ రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. బిహార్ సీఎం, జేడీ(యు)నేత నీతీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగే యోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహన్‌ను కలిసేందుకు నీతీశ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. బీజేపీతో తాము పొత్తు వీడుతున్నామని గవర్నర్‌కు ఆయన అధికారికంగా చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.