తిరుమల శ్రీవారికి రోజూ జరిగే పూజా, సేవా కార్యక్రమాలలో చాలా తప్పులు జరగవచ్చు. కొందరు భక్తులు పురుడు, మరణం, బహిస్టు సమయాల్లో కూడా ఆలయ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. వాటి కారణంగా కలిగే దోష పరిహారం కోసం ప్రతి ఏటా తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలను చేపడుతారు. ఈ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే పవిత్రోత్సవాలకు వేలాది మంది తరలివస్తారు.