వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ రగడ ఏపీ పోలిటిక్స్ లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇదే అంశంపై దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా ప్రవర్తించిన మాధవ్ పై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. మాధవ్ ను కాపాడాలనేది ముమ్మాటికీ జగన్ ఆలోచనేనని ఆయన ఆరోపించారు.