దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం రోజున ఢిల్లీలో 2,423 కేసులు, రెండు మరణాలు నమోదవగా, పాజిటివిటీ రేటు 14.97 శాతంగా ఉందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కేసుల పెరుగుదల భారీగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆందోళనేదీ అవసరం లేదని ఆయన ప్రకటించారు.