అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియజేసారు.
ఈ విషయంపై స్పందిస్తూ... పోలవరం ప్యాకేజి దగ్గర నుండి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చెయ్యడం వరకూ జగన్ రెడ్డి వారిని నమ్మించి వంచించారు.
మాటలతో కోటలు కట్టడం మాని వైసిపి ప్రభుత్వం చిత్తశుద్దిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలి. ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.