ప్రభుత్వ దారుణాలపై మాట్లాడకూడదని చెప్పడం హక్కులను హరించడమే అని నారా చంద్రబాబు నాయుడు తెలియజేసారు. వంగలపూడి అనిత కి వచ్చిన భేదిరింపు ఫోన్ కాల్ మీద స్పందిస్తూ..... దీనిని నేను ఖండిస్తున్నాను. పోలీసులు దీని పై చర్యలు తీసుకోరా?
అదీగాక ఒక మహిళా నేతనే ఫోన్ చేసి బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు తెగబడ్డారంటే...ఇక రాష్ట్రంలో సామాన్య మహిళలు ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించండి. పోలీసుల విషయానికి వస్తే... జగన్ రెడ్డి ఆదేశాలు వచ్చేంతవరకు అన్నిటినీ చూస్తూ కూర్చోవడమే వారి పని అన్నట్టు అయిపోయింది అని ఆగ్రహం వ్యక్త పరిచారు.