నీతీ ఆయోగ్ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్ నెంబర్:1 కు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ముఖ్యమంత్రిగారు ఒకరు. కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్ దగ్గర లంచ్ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చకులమీడియా స్థాయి ఎక్కడ? అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు... 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్ యద్ధం వల్ల; 2019లో మోడీగారి గాలిలో అధికారంలోకి రావటం తప్పితే... సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు అని ఆరోపించారు.
ఇలాంటి వారిని ఇంగ్లీష్‌లో పేరసైట్స్ అంటారు. అంటే... పరాన్న జీవులు! ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్ళలోనూ తిని... అందరి ఇళ్ళ వాసాలూ లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్ళీ కలుద్దాం, మా ఇంటికి రండి అని ఎందుకు అంటారు? అని ఎద్దేవా చేసారు.