కళాశాల హాస్టల్లో అధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగరలో చోటుచేసుకుంది. మైసూర్ లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న చందన(26) ఆత్మహత్య చేసుకుంది. అవివాహిత అయిన చందన కళాశాల హాస్టల్లో ఉంటోంది. మంగళవారం ఉదయం హాస్టల్ గది నుంచి బయటకు రాకపోవడంతో విద్యార్థులు కిటికి నుంచి చూడగా ఆత్మహత్య విషయం వెలుగుచూసింది. తన చావుకు ఎవరూ కారణం కాదని డెత్‌నోట్ రాసింది. అదే రోజు ఆమె పుట్టినరోజు కావడం విశేషం.