శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అధిక ధరలు, విద్యుత్ కోతలతోపాటు నిత్యవసరాలు, ఇంధనం, ఔషధాల వంటి కొరతతో ఆ దేశ ప్రజలు సతమతమవుతున్నారు. విద్యుత్ ధరలను 264 శాతం పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. కరెంటు కోతలను భరించలేకపోతున్నారు. లంకలో విద్యుత్ ధరల పెంపు తొమ్మిదేళ్లలోనే ఇది మొదటిసారి కావడం గమనార్హం. పరిస్థితిని చక్కదిద్దేందుకు లంక సర్కార్ ప్రయత్నిస్తోంది.