ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, వ్యాయామం కొరత, పోషకాహారం లోపం, పొగతాగడం వంటి కారణాల వల్ల మనకు ప్రాణశక్తిని అందించే ఊపిరితిత్తులు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయ, పసుపు, బ్లూ బెర్రీలు, గ్రీన్ టీ, పెప్పర్స్, యాపిల్, ఆలివ్ ఆయిల్, బార్లే వంటి ఆహార పదార్ధాలు ఊపిరితిత్తులను కాపాడతాయి.