మానవులు అడవులను నాశనం చేస్తున్న కారణంగా ప్రపంచంలో సింహాల ఉనికికే ముప్పు ఏర్పడిందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. కాగా ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా బుధవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం తన అధికారిక ట్విటర్ ఖాతాలో సింహాల ఫొటోలు పంచుకుంది. ప్రతి ఒక్కరూ సింహాల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. సింహాన్ని న్యాయానికి, ధైర్యానికి, వీరత్వానికి ప్రతీక అని తెలిపారు.