ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 08:29 PM

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంబంధించి బయటికి వచ్చిన వీడియో ఫేక్ అని అనంతపురం పోలీస్ వారు తెలియజేసారు. దీనిపై స్పందించిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.....అనుకున్నట్లే జరిగింది. తప్పుని కప్పిపుచ్చడానికి  చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు. 


డర్టీ ఎంపీ మాధవ్ కు సచ్చీలుడు అన్న సర్టిఫికేట్ ఇస్తున్నారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎం గా, ఆ పార్టీ  అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంపీ మాధవ్ మీద చర్యలు తీసుకోనట్లయితే, ఈసారి మీకు రాష్ట్ర మహిళల దెబ్బ గట్టిగా తగులుతుంది అని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com