ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల పై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ పొందొచ్చు. అయితే సిలిండర్ కొనేప్పుడు పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బుల్ని క్రెడిట్ చేస్తుంది. కస్టమర్ సిలిండర్ తీసుకున్న కొద్దిరోజుల్లోనే సబ్సిడీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. మీకు వరుసగా రెండు నెలలు సబ్సిడీ డబ్బులు రాకపోతే ఎల్‌పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవాలి. ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీల నుంచి మీరు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నా ఎల్‌పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవడానికి వేర్వేరు వెబ్‌సైట్స్ చూడాల్సిన అవసరం లేదు. http://mylpg.in/ వెబ్‌సైట్‌లో మీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ముందుగా http://mylpg.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోనే మీ 17 అంకెల ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయండి. ఎల్‌పీజీ ఐడీ మీ ఎల్‌పీజీ పాస్ బుక్ పైన ఉంటుంది. ఒకవేళ మీ ఎల్‌పీజీ ఐడీ తెలియకపోతే click here to know your LPG ID పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు సెలెక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఎల్‌పీజీ ఐడీ తెలుస్తుంది. ఆ తర్వాత మీ ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేసుకొండి. మీ ఇమెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఈ వివరాలతో లాగిన్ చేస్తే మీ ఎల్‌పీజీ అకౌంట్‌కు బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో తెలుస్తుంది. అందులోనే మీ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్ అయిందో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు.