ఏటా ఆగస్టు 13ను 'ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే'గా నిర్వహిస్తుంటారు. ప్రపంచ జనాభాలో 10 శాతం ఉండే వీరికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరిలో తెలివితేటలు అధికంగా ఉంటాయని, అందువల్ల ఉన్నత స్థానాలకు చేరుకుంటారని కొందరు పేర్కొంటారు. ఆ ప్రచారం నిజం చేసేలా ఎందరో లెఫ్ట్ హ్యాండర్స్ వివిధ రంగాలలో దిగ్గజాలుగా నిలిచారు. భారత ప్రధాని మోడీ, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ ఒబామా, సచిన్, అమితాబ్ లెఫ్ట్ హ్యాండర్సే.