భారతదేశానికి స్వతంత్ర సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దేశంలో ఏడాదికాలంగా ఆజాద్గా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఈనెల 13 నుంచి 15 వరకు జాతీయ పతాకం రెపరెపలాడాలని ఆదేశించారు ఇందులో భాగంగానే హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం ప్రారంభించారు శనివారం మాడుగులలో దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వేలు పూర్తవుతున్న నేపథ్యంలో 75 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని గ్రామ పురవీధుల్లో అటహాసంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎవత్ మాడుగుల ప్రజలు విద్యార్థులు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని దేశ నాయకులకు స్థానిక సమరయోధులకు జేజేలు కొడుతూ నివాళులు అర్పించారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు స్వాతంత్ర స్ఫూర్తిని అందిస్తూ వివిధ రకాల గేయాలు ఆలపించారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం కూడా మాడుగుల పురవీధుల్లో పెద్ద ఎత్తున జాతీయ పతాకాన్ని ఊరేగించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీ రామధర్మజ, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు, బిజెపి సీనియర్ నాయకులు పుట్ట గంగయ్య ఆర్బికే చైర్మన్ కే శ్రీధర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు పుట్ట మురళి , వాసవి క్లబ్ అధ్యక్షుడు పుట్ట బలరాం, మన్యం జ్యోతి సేవా సంఘం అధ్యక్షుడు మండల సతీష్, భారత నిర్మాణ సేవా సంఘం ప్రతినిధి జీ మహేష్ తో పాటు వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల ప్రతినిధులు వివిధ పార్టీల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.