మర్రిపూడి: వాహనాదారులు హెల్మెట్ ధరించకుంటే చర్యలు తప్పవని మర్రిపూడి ఎస్ఐ అంకమ్మరావు హెచ్చరించారు. స్ధానిక పోలీసు స్టేషన్ ఎదుట శుక్రవారం పలు వాహనాలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలపై వాహనాదారులకు ఆయన అవగాహన కల్పించారు. విధిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని వారికి సూచించారు. సరైన ధ్రువీకరణ ప్రతాలు లేని పలు వాహనాలను గుర్తించి జరిమానా విధించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది పలువురు ఉన్నారు.