వాతావరణ మార్పులు యూరప్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎండ వేడిమికి పలు దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్ లాంటి యూరప్ దేశాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. కాగా దక్షిణ ఇంగ్లండ్‌లోని థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. నీటి ఆనవాళ్లు లేకుండా ఎడారిని తలపిస్తోంది.