చదువు కంటే సంస్కారం గొప్పదని సమగ్ర శిక్షణ పథక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగర పరిధిలోని నగర పాలక మెయిన్‌లో 10 రోజుల నుంచి నిర్వహిస్తున్న సాల్ట్ శిక్షణను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తరగతి గదిలో సెమినార్స్, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ ద్వారా విద్యాబోధన, క్రమశిక్షణతో వ్యక్తిత్వం, వేషధారణ, వస్త్రధారణ వంటి వాటిని విద్యార్థులలో అలవాటు చేయాలన్నారు. అప్పుడే వారిలో దాగి ఉన్న సజనాత్మకత వెలికి తీయవచ్చని పేర్కొన్నారు. పద్యాలు, పాటలు, సక్సెస్ స్టోరీస్ లాంటి వాటిని విద్యార్థులకు రోజువారి కార్యక్రమంలో భాగం చేయాలని సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుందని చెప్పారు.. అనంతరం మాస్టర్ ట్రైనర్లు శిక్షణకు హాజరైన ప్రధానోపాధ్యాయులకు, సూచనలిచ్చారు.