పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో దారుణం జరిగింది. తన ఐదేళ్ల కుమార్తె దీపజిత్ కౌర్‌ను తల్లి మణిందర్ కౌర్ గురువారం హత్య చేసింది. బాలిక మృతదేహాన్ని స్వర్ణ దేవాలయం సమీపంలో పడేసింది. ఆ తర్వాత తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణ చేపట్టగా, సీసీ టీవీ ఫుటేజీలో తల్లే హంతకురాలని తేలింది. ఆమెను విచారించగా నేరం అంగీకరించింది. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa