విశాఖపట్నం, నర్శీపట్నం: ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి ప్రతి ఒక్కరు వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. శనివారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ. జెండా ఎగురవేసే ముందు నిబంధనలను ఒక్కసారి పరిశీలించాలన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు.