బీజేపీది అసలు దేశభక్తే కాదని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ అంశాన్ని ఆ పార్టీ ఎంచుకుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మైలేజీ కోసం స్వాతంత్య్ర దినోత్సవాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ కారుపై బీజేపీ నేతలు చెప్పులు విసిరారన్నారు. కారుపై భారత జెండా ఉందనే విషయం మరిచారని, జాతీయ జెండాను బీజేపీ అవమానించిందని పేర్కొన్నారు.