ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతినుద్దేశించి మాట్లాడారు. వచ్చే 25 ఏళ్లు ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
* దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ది చెందాలి.
* బానిసత్వపు ఆలోచనలను మనసులో నుంచి తీసి పారేయాలి.
* మన దేశ చరిత్ర, సంస్కృతిని చూసి గర్వపడాలి.
* ఐకమత్యంతో దేశ ప్రజలు ముందుకు వెళ్లాలి.
* ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి.