స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం మరణించారు. రూ.5 వేలతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన రూ.50 వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారు. పెళ్లైన 17 ఏళ్లకు రాకేశ్-రేఖా దంపతులకు 2004లో కుమార్తె నిష్ఠ పుట్టింది. 2009లో ఆర్యమాన్, ఆర్యవీర్ అనే కవలు పుట్టారు. తన ఇద్దరు కొడుకులకు25 ఏళ్లు వచ్చే వరకు జీవించాలనేది ఆయన కోరిక. అయితే ఆయన తన చివరి కోరిక తీరమకుండానే మరణించారు.