మనిషి ఆరోగ్యవంతంగా జీవించడానికి 7-8 గంటల నిద్ర అవసరం. పొద్దున్న ఎండ కనీసం 20 నిమిషాల పాటు ఒంటిపై పడితే చక్కగా నిద్ర పడుతుందట. నిత్యం ఓట్స్, పప్పులు, పండ్లు, కూరగాయల ద్వారా 30 గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి. నిద్ర పోయే ముందు కనీసం 6 నిమిషాలు చదవాలి. బెడ్‌రూమ్‌లోనూ కాస్త చల్లగా ఉండటం ముఖ్యం. 10 నిమిషాల పాటు నెమ్మదైన సంగీతం వింటే మనసు తేలికవుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి.