రేణిగుంట గంగమ్మ జాతర సందర్భంగా పట్టణం మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. ఎక్కడ చూసిన జాతర శోభ కనిపిస్తోంది. కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతర కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జునరెడ్డి తెలిపారు. సోమవారం గరిగ ఊరేగింపుతో మూడు రోజుల జాతర వేడుకలు ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.