ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం విజయవాడకు వచ్చిన అమెజాన్ ప్రతినిధులతో సెర్ప్ అధికారులు సమావేశమై అన్ని విషయాలపై చర్చించారు. డ్వాక్రా మహిళా ఉత్పత్తులను అమెజాన్లో విక్రయించేందుకు కంపెనీ ప్రతినిధులు అంగీకరించినట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు.