మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం కోర్టు రహస్య విచారణ చేపట్టింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. దేశద్రోహం, అవినీతి ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది.