కొంతమందికి రాత్రిపూట సరిగా నిద్రపట్టదు. అలాంటి వారు సరైన మోతాదులో ఫైబర్ లభించే ఆహారాలను తీసుకోవాలి. ఓట్స్, పప్పులు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రించే ముందు కొంతసేపు బుక్స్ చదివితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే బెడ్‌రూమ్ కాస్త చల్లగా ఉండటం ముఖ్యం. 25-26 డిగ్రీల వాతావరణంలో నిద్ర బాగా పడుతుంది. మ్యూజిక్, యోగ వల్ల మెదడుకు విశ్రాంతి దొరికి నిద్రపడుతుంది.