శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 15 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.94 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా స్పిల్‌వే ద్వారా 3.76 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.40 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది.