హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈనెల 17, 18వ తేదీలలో హిందూపురంలో పర్యటించనున్నట్లు టిడిపి పట్టణ అధ్యక్షులు డీఈ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించనున్నట్లు మంగళవారం తెలిపారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో పలు పాఠశాలలకు టీవీలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.