రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో గుడమలాని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విస్తుపోయే ఘటన జరిగింది. అంతా ఇండిపెండెన్స్ డే వేడుకల తర్వాత సోమవారం కొందరు గ్రామస్తులకు భోజనంతో పాటు, నిషేధిత ఓపియం (నల్లమందు) పంపిణీ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఓంప్రకాష్ విష్ణోయ్ స్పందించారు. అధికారులు అక్కడికి చేరుకునేలోపు ఎవరూ లేరని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.