అచ్యుతాపురం సెజ్ లో సీఎం జగన్ మంగళవారం ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 'రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా సహకారం అందిస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో సెకండ్ ఫేజ్ కు ముందుకొచ్చారు. ఆగస్టు 2023 నాటికి ఈ పనులు పూర్తవుతాయి. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,64,155 మందికి ఉద్యోగాలొస్తాయి' అని తెలిపారు.