యాపిల్ సంస్థ భారీగా ఉద్యోగులపై వేటు విధించింది. గత వారంలో 100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగల్ని తొలగించింది. ప్రస్తుతం యాపిల్లో తొలగింపు అంశం చర్చాంశనీయంగా మారగా.. మిగిలిన కంపెనీలు సైతం కాస్ట్ కటింగ్ గురించి ఆలోచించడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగుల్ని సెప్టెంబర్ 5 నుంచి ఆఫీస్కు రావాలని యాపిల్ డెడ్లైన్ విధించింది.