ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి ఎక్కడనుండి మొదలవుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 07:03 PM

అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..... రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని  పేర్కొన్నారు. 


ఒక ప్రాంతం అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలన్నారు. మూడేళ్లలో 98 భారీ పరిశ్రమల ద్వారా 39,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో 31,671 పరిశ్రమలు రూ.8,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 


వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయని చెప్పారు. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మూతపడ్డ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నామని చెప్పారు. 


ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని తెలిపారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa