తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వర్సిటీ ఆవరణలో తిరుగుతున్న కుక్కలపై చిరుత దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుతపులి సంచారం నేపథ్యంలో వర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. కాగా, గతేడాది కూడా ఓ చిరుత ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ప్రవేశించి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.