జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే, వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు. అనంతరం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.