ఏటీఎం వినియోగదారులకు పలు బ్యాంకులు షాకిచ్చాయి. ఇకపై ఏటీఎంలలో పరిమితి దాటిన తర్వాత ప్రతీ ఆర్థిక లావాదేవీకి రూ.17, ఆర్థికేతర లావాదేవీలకు రూ.6 వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారుల జరిపే లావాదేవీలకు రుసుంను విధించడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతించింది. మరిన్ని ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, వాటి నిర్వహణ కోసమే బ్యాంకులు ఈ సర్వీసు చార్జీలను ఉపయోగిస్తాయి.