భారత్ లో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతినెల 80 వేల కేసులు నమోదవుతున్నాయి. సైబర్ నేరాలపై తాజాగా జరిపిన సర్వేలో దేశంలో 42 శాతం మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు దాదాపు ప్రతి నెల రూ.200 కోట్లు కొల్లగొడుతున్నారు. తెలంగాణలో సగటున 9 కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 5 వేల కేసులు నమోదయ్యాయి.