బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును బుధవారం ఏర్పాటు చేశారు. 11 మందితో కొత్త పార్లమెంటరీ బోర్డును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ప్రధాని మోదీ, రాజ్ నాథ్ సింగ్, యడ్యూరప్ప తదితరులు ఉన్నారు. పార్లమెంట్ బోర్డులో తెలంగాణ నుంచి ఎంపీ లక్ష్మణ్ కు స్థానం లభించింది. అలాగే 15 మందితో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని నియమించారు. 2 కమిటీల్లోనూ లక్ష్మణ్ కు చోటు దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa