యూపీలోని కొత్వాలి సమీపంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. భర్త పని నిమిత్తం వేరే చోట ఉంటుండగా, అత్తతో కలిసి బాధిత మహిళ ఉంటోంది. ఈ నెల 11న వారు పడుకోగానే అర్ధరాత్రి కొందరు దుండగులు ఇంట్లో చొరబడ్డారు. పడుకున్న సదరు వివాహితను పక్క గదిలోకి ఎత్తుకెళ్లారు. తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం చేసి, పరారయ్యారు. సోషల్ మీడియాలో విషయం వైరల్ కావడంతో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.