అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకం చెల్లదని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్నాడీఎంకేను చేజిక్కించుకునేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం పోటీ పడ్డారు. ఈ క్రమంలో పళనిస్వామి వర్గం మొత్తం 16 తీర్మానాలను తీసుకొచ్చి ఆమోదించగా.. అందులో చట్టబద్ధత లేదని పన్నీర్ సెల్వం వర్గం కోర్టును ఆశ్రయించింది.