ఏపీలోని ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద 15 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 14.73 లక్షల క్యూసెక్కుల నీటిని, డెల్టా కాల్వలలోకి 10,800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. విలీన గ్రామాలతో పాటు, లంక గ్రామాలు వరద నీటిలో మునిగాయి.