టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ పరిస్థితి దయనీయంగా మారింది. కొంత కాలం క్రితం వరకు 'టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ'లో మెంటార్ చేసేవాడు. రోజులో సగం ప్రయాణానికే అయిపోతుండడంతో మానేసినట్లు కాంబ్లీ చెప్పాడు. బీసీసీఐ ఇచ్చే రూ.30 వేల పెన్షనే తనకు ఆధారమని, పూట గడిచేందుకు కష్టంగా ఉందని వాపోయాడు. ముంబైలోనే ఏదైనా పని ఇప్పించాలని బీసీసీఐను వేడుకుంటున్నాడు.